మనసెరిగిన మనోహరితో ఊసులు అనందడోలికలు
సరసమెరిగిన ప్రియ సఖితో సయ్యాటలు అనుభూతుల గురుతులు
ఆడిన ఊసులు మరచి చెసిన బాసలు మరచి
ప్రియ సఖి పరసఖి అయితే
సరసం మరచి, విరహం విడచి
నెచ్చెలి నా ఊహలకు దూరం అయితే
ఒకరినొకరితో మమేకమై ఒకరికొకరు జీవించాలని
చేసుకున్న బాసలకు ఎవరు చెప్పగలరు
జీవితకాలం కలసి ఉండాలని అనందాన్ని అనుభవించాలని
కలసి కన్న కలలకు ఎవరు చెప్పగలరు
ఆ ఆశలన్నీ ఆదియాశలయ్యయని
ఆ కలలన్నీ కల్లలయ్యాయని